ఈ పని సరిగా చేస్తే వ్యాక్సిన్‌ వేసుకున్నంత రక్షణ!

7 May, 2021 08:55 IST|Sakshi

‘మాస్క్‌’ ఉంటే మహారాజులే!, సరిగా ధరిస్తే సూపర్‌ రక్షణ

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: ఓకే.. వ్యాక్సిన్ల కొరత ఉంది.. అందరికీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు.. మరేం చేద్దాం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు ఇవన్నీ మన చేతిలో లేవు.. మరి మన చేతిలో ఉన్నదానిపైన దృష్టి పెడదామా.. ఎందుకంటే.. ఈ పనిని మనం సరిగా చేస్తే.. దాదాపు వ్యాక్సిన్‌ వేసుకున్నంత రక్షణ అని అంతర్జాతీయంగా పలు పరిశోధన సంస్థలు అధ్యయనాలు చేసి మరీ తేల్చాయి. ఇంతకీ ఏంటా పని? మాస్కు సరిగా వేసుకోవడం!! సింపుల్‌. ఆ చాలామంది వేసుకుంటున్నారుగా అని మీరు అనవచ్చు..

ఇక్కడ మేం అన్నది మాస్క్‌ను సరిగా వేసుకోవడం అని.. ఎందుకంటే.. మన దగ్గర మాస్కు ముక్కుకు కాదు..మూతికి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి.. మాస్కు వేసుకుంటున్నవారిలో సగం మంది ముక్కు కిందకు దించి వాడుతున్నారు కాబట్టి.. అందుకే మన చేతిలో.. మనం చేయగలిగిన ఈ పనిని సరిగా చేస్తే.. వ్యాక్సిన్‌ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కలి్పస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్‌ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గరద్శకాలనూ విడుదల చేసింది.అవేంటో చూద్దామా.. 

ఎలాంటి మాస్కు తీసుకోవాలి?
ఏది తీసుకున్నా.. అది మలీ్టలేయర్డ్‌ ఉండేలా చూసుకోండి.. కనీసం మూడు పొరలు ఉండాలి. దగ్గరగా నేసినవై ఉండాలి. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్‌ మాసు్కలకూ ఇదే వర్తిస్తుంది. 
నోస్‌ వైర్‌ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి. 

ఇలాంటివి వద్దు
చాలామంది మాస్కులకు వాల్వులు ఉన్నవి వాడుతున్నారు. అలాంటివి వద్దు. అలాగే ఒకే పొర ఉన్నవి.. కాంతిని నిరోధించలేని మాస్కులను కొనుగోలు చేయవద్దు. 
ఎన్‌–95 లేదా కేఎన్‌–95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య జనమూ వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేఎన్‌–95 మాసు్కలు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు. 

ఎలా ధరించాలి?
ఏ మాస్కు అయినా.. సరిగా ఫిట్‌ అయిందో లేదో చూసుకోవాలి. అన్ని వైపులా కవర్‌ అవ్వాలి. నోస్‌ వైర్‌ ఉన్న మాస్కు తీసుకోవడం వల్ల అది పై నుంచి గాలి బయటకు పోకుండా లేదా రాకుండా నిరోధిస్తుంది. దాన్ని మీ ముక్కుకు తగ్గట్లు ప్రెస్‌ చేయాలి. సరిగా ఫిట్‌ అయి ఉంటే.. వేడి గాలి మాస్కు ముందు భాగం నుంచి రావడాన్ని గమనిస్తారు. అంతేకాదు.. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానికి తగ్గట్లు మాస్కు కూడా ముందుకు వెనక్కు కదలడాన్ని గమనించవచ్చు. 

ముఖ్యంగా డిస్పోజబుల్‌ మాసు్కల విషయంలో పై ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం లూజుగా ఉంటుంటాయి. సైడ్‌ నుంచి గాలి పోయే అవకాశము ఎక్కువ. అందుకే వీటి విషయంలో ఈ విధంగా తాళ్లను ముడివేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. 

అలాగే.. ఈ మధ్య డబుల్‌ మాస్క్‌ ఎక్కువగా ధరిస్తున్నారు. దీని వల్ల అదనపు రక్షణ లభిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగని రెండు డిస్పోజబుల్‌ మాసు్కలు ఒకదానిపై ఒకటి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అటూఇటూ గాలి పోతూనే ఉంటుంది. దానికి బదులుగా డిస్పోజబుల్‌ మాస్కు వేసుకుని.. దాని మీద క్లాత్‌ మాస్కు వేసుకుంటే.. ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. అది కూడా డిస్పోజబుల్‌ మాస్కు అంచులని ముఖానికి అదిమిపట్టేలా క్లాత్‌ మాస్కు వేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక గడ్డం ఉన్నవారి విషయంలో మాస్క్‌ ఫిటింగ్‌ అన్నది సమస్యగా మారింది. వీరికంటూ ప్రత్యేకమైన మాసు్కలు లేని నేపథ్యంలో.. ఈ కరోనా కాలంలో అయితే షేవింగ్‌ చేసుకోవడం లేదా.. గడ్డం ట్రిమ్‌ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని సీడీసీ తెలిపింది. వీరు డబుల్‌ మాస్క్‌ ధరిస్తే.. మరింత సురక్షితమని పేర్కొంది. వీటితోపాటు సోషల్‌ డిస్టెన్స్‌ కూడా ముఖ్యమని మరోమారు స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు