విమానంలో ఆరు సీట్లను బెడ్‌గా మార్చారు ఎందుకో తెలుసా!

4 Nov, 2022 20:12 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత పొడుగైనా మహిళగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్న రుమేసా గెల్గి తొలిసారిగా ఫ్లైట్‌ జర్నీ చేసింది. ఆమె పొడుగే శాపంగా మారి ఎక్కడికి ప్రయాణించలేక ఇబ్బంది పడుతుండేది. ఐతే ఆమె బాధను టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ దూరం చేసింది. ఆమె పొడగు కారణంగా విమానంలో కూర్చొని ప్రయాణించడం అసాధ్యం. అందుకని ఆమె కోసం ఆరు సీట్లను బెడ్‌గా మార్చి విమానంలో ప్రయాణించే ఏర్పాటు చేసింది.

దీంతో ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయింది. గెల్గి ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ మేరకు గెల్గి విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్‌ నుంచి యునైటెడ్‌ స్టే‍ట్స్‌లోని శాన్‌ప్రావిన్‌స్కోకు 13 గంటలు ప్రయాణించింది. ఇది తన చివరి ఫ్లైట్‌ జర్నీ మాత్రం కాదని నమ్మకంగా చెబుతోంది.

తాను సాంకేతిక రంగంలో పనిచేస్తున్నానని, తనలాంటి వారికోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉంటానని చెబుతోంది. విమానంలో ప్రయాణించే అవకాశం ఇచ్చినందుకు టర్కీష్‌ ఎయిర్‌ లైన్స్‌కి ధన్యావాదాలు చెప్పింది. భవిష్యత్తులో ఆమెకు మరింత సహాయ సహకారాలను అందజేస్తామని టర్కీ ఎయిర్‌లైన్స్‌ హామి ఇచ్చింది. 

A post shared by RUMEYSA GELGI (@rumeysagelgi)

(చదవండి: ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న వెర్బల్‌ ఫాస్ట్‌! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..)

మరిన్ని వార్తలు