Boris Johnson India Visit: భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే

18 Apr, 2022 10:23 IST|Sakshi

21న అహ్మదాబాద్‌లో టూర్‌ 

22న మోదీతో భేటీ

లండన్‌: ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21, 22తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్‌ నుంచి నేరుగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలపై చర్చిస్తారు. 22న ఢిల్లీలో మోదీతో సమావేశమవుతారు. రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో  వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ఇ

రుపక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపైనా చర్చ జరగనుంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందంటూ ఈ సందర్భంగా జాన్సన్‌ ప్రశంసలు కురిపించారు. ‘అరాచక దేశాల వల్ల భారత్, ఇంగ్లాండుల్లో శాంతికి ముప్పుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో భారత్‌ మాకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశం’ అన్నారు.  తనది ఉభయతారక పర్యటన కాగలదని ఆకాంక్షించారు.
చదవండి: త్వరలో ఉద్యోగులకు సీఎం స్టాలిన్‌ శుభవార్త?

మరిన్ని వార్తలు