న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. తీవ్ర ఉద్రిక్తత

13 Feb, 2024 07:40 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ బ్రాంక్స్‌ సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా అయిదుగురు గాయపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా గుర్తించారు.

ఇద్దరు టీనేజర్ల మధ్య వాగ్వాదమే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఏ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదని చెప్పారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తొలుత నెంబర్‌ 4 రైలులో ప్రారంభమైన గొడవ రైలు మౌంట్‌ ఈడెన్‌ ఎవెన్యూ స్టేషన్‌ చేరుకున్న తర్వాత పెద్దదైందని, ఇంతలో ఒక వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామని దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. 

ఇదీ చదవండి.. ఇండోనేషియాలో ఒకే రోజు ఐదు ఎన్నికలు 

whatsapp channel

మరిన్ని వార్తలు