ఘోరం ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం

14 Dec, 2021 20:05 IST|Sakshi

పోర్ట్‌–ఔ–ప్రిన్స్‌: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్‌–హైతియన్‌ నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్‌ పాట్రిక్‌ అల్మోనార్‌ చెప్పారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ పేర్కొంది.

సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు. ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్‌ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!

మరిన్ని వార్తలు