రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్‌’ దెయ్యాల కొంప

28 Sep, 2021 18:03 IST|Sakshi

అమెరికాలో హాంటెడ్‌ హౌస్‌గా పేరుగాంచిన రోడ్ ఐలాండ్ ఫామ్‌హౌస్

దీని ఆధారంగా తెరకెక్కిన హర్రర్‌ సినిమా ‘ది కంజురింగ్‌’ 

వాషింగ్టన్‌/బురిల్‌విల్లే: దెయ్యాల గురించి ఎన్ని కథలు, సినిమాలు వచ్చినా హిట్టే తప్ప.. ఫెయిల్‌ అవ్వడం ఉండదు. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు, ఇళ్లు, ఆఖరికి వస్తువులు కూడా దెయ్యాల నివాసాలుగా ప్రచుర్యం పొందుతాయి. ఈ కోవకు చెందినదే అమెరికా బురిల్‌విల్లే ప్రాంతానికి చెందిన ‘రోడ్‌ ఐల్యాండ్‌’ ఫామ్‌హౌస్‌. ఈ ఇంటి గురించి ఆ చుట్టూ పక్కల ఎవరిని ప్రశ్నించినా.. భయంతో గజ్జున వణికిపోతారు. ఇక ఈ ఇంట్లో జరిగే వింత సంఘటనల గురించి కథలు కథలుగా వర్ణిస్తారు. 

రోడ్‌ ఐలాండ్‌ ఫామ్‌హౌస్‌పై ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా 2013లో హాలీవుడ్‌లో ‘ది కంజూరింగ్‌’ సినిమా తీశారు. అది బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ దెయ్యాల కొంప ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే.. తాజాగా ఈ హాంటెడ్‌ హౌస్‌ని వేలం వేశారు. ఆశ్చర్యంగా అది కాస్తా 1.2 మిలియన్‌ డాలర్లు (8,89,48,380 కోట్ల రూపాయలు) పలికి అందరిని ఆశ్చర్యపరింది. ఆ వివరాలు.. 

అమెరికాలోని బురిల్‌విల్లే ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని 1826 లో నిర్మించారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతంలో ఫామ్‌హౌస్‌ కేవలం 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఈ ఇంట్లో మొత్తం మూడు బెడ్‌రూమ్‌లు, 1 1/2 బాత్రూమ్‌లు ఉన్నాయి. మొత్తంగా ఈ ఇంటిలో మొత్తం 14 గదులు ఉన్నాయి.
(చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్‌)

ఈ ఫామ్‌హౌస్‌ 19వ శతాబ్దానికి చెందిన పెర్రాన్‌ కుటుంబానికి చెందినదిగా దివంగత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ 1971లో ప్రకటించారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మరణించిన బత్‌షెబా షెర్మాన్ అనే మంత్రగత్తె ఈ ఫామ్‌హౌస్‌ను వెంటాడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ఫామ్‌హౌస్‌ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది కంజురింగ్‌’ హర్రర్‌ చిత్రాన్ని ఈ ఇంటిలో చిత్రికరించలేదని.. కానీ అక్కడ నివసించిన పెర్రాన్ కుటుంబ సభ్యుల అనుభవాల ఆధారంగా రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2013 లో సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ ఇల్లు ప్రజాదరణ పొందింది.
(చదవండి: శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..)

"ఈ ఇంటికి సంబంధించిన సమాజంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా డజన్ల కొద్దీ పుస్తకాలు, సినిమాలను తెరకెక్కాయి. చాలా మంది అర్హత కలిగిన పారానార్మల్ పరిశోధకులు ఇంటికి వెళ్లి దెయ్యాల గురించి పరిశోధించారు. న్యూ ఇంగ్లాండ్‌లో పురాతన దెయ్యం వేట బృందాన్ని స్థాపించిన అత్యంత ప్రసిద్ధ ఎడ్, లోరైన్ వారెన్‌లు 1970 లో ఈ ఫామ్‌హౌస్‌ మిస్టరీని చేధించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో వారు ‘ది కంజురింగ్’ సినిమాలో ఉన్న అనేక సంఘటనలు.. ఈ ఫామ్‌హౌస్‌లో వాస్తవంగానే జరిగాయని ధ్రువీకరించారు. 

"ప్రస్తుత ఈ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డులుగా ఉన్న వారు ఇంట్లో జరిగే వింతలకు సంబంధించి లెక్కలేనన్ని సంఘటనలను నివేదించారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌస్‌ రాత్రిపూట నిర్వహించే గ్రూప్‌ ఈవెంట్స్‌కి బాగా ప్రాచుర్యం పొందింది.

చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!

మరిన్ని వార్తలు