అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి

29 May, 2021 18:46 IST|Sakshi

రోమ్‌: గత ఆదివారం నార్త్‌ ఇటలీలోని మాగ్గియోర్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కేబుల్‌ కార్‌ బ్రేక్‌ ఫెయిల్‌ అయి కొండల్లో పడిపోవడంతో క్యాబిన్‌లోని 14 మంది చనిపోయారు.. కానీ ఒక్కడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనే ఐదేళ్ల పిల్లాడు ఈతాన్ బిరాన్.. యాక్సిడెంట్‌ జరిగిన రోజు నుంచి కోమాలో ఉన్న ఈతాన్‌ బిరాన్‌ శుక్రవారం సృహలోకి వచ్చాడు. కళ్లు తెరిచిన మరుక్షణం..  అమ్మ, నాన్న ఎక్కడ.. వారిని చూడాలి అంటూ ఈతన్‌ అడిగాడు. కానీ ఆ ప్రమాదంలో అతని పేరెంట్స్‌తో పాటు తమ్ముడు, తాతను కోల్పోయినట్లు అతనికి తెలియదు. ఆ విషయం ఆ పిల్లాడికి ఎలా చెప్పాలో ఆసుపత్రి సిబ్బందికి  అర్థం కావడం లేదు. ప్రస్తుతం బిరాన్‌ను చూసుకోవడానికి పిల్లాడి ఆంటీ ఆయా తోడుగా ఉంది.

విషయంలోకి వెళితే.. ఈతన్‌ బిరాన్‌..  తండ్రి అమిత్‌(30), తల్లి తాల్‌(26),తమ్ముడు టామ్‌(2)తో పాటు తాత, నానమ్మ కోహెన్‌(81), కోనిస్కి(71) తో కలిసి నార్త్‌ ఇటలీలో టూర్‌కి వచ్చాడు. మాగ్గియోర్ సరస్సు వద్ద ఉన్న కేబుల్‌ కార్‌లో ఎక్కడానికి వారంతా సిద్దమయ్యారు. ఈ కుటుంబంతో పాటు మరో 8 మంది కూడా క్యాబిన్‌లో ఎక్కారు. కొద్దిదూరం వరకు బాగానే వెళ్లినప్పటికి మధ్యలో సడెన్‌గా బ్రేక్‌ డౌన్‌ అయింది. అయితే దురదృష్టవశాత్తూ కేబుల్ తెగింది. దీంతో కొండ మధ్యలో ఉన్న వాళ్లు దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోగా.. చెట్ల మధ్యలో క్యాబిన్‌ ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఈతా బిరాన్‌ ఫ్యామిలీతో సహా మిగతా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ బిరాన్‌ మాత్రం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయినవారిని క్యాబిన్‌లో నుంచి బయటికి తీశారు. కాగా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. బ్రేక్స్‌ సరిగా ఉన్నాయోల ఏదో చూసుకోకుండానే ఆపరేషన్‌ నిర్వహించినట్లు తేలింది. కాగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. ప్రమాదానికి కారణమైన ముగ్గురి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు