తాలిబన్ల చెరలో అఫ్గన్‌: హృదయ విదారక దృశ్యాలు.. వైరల్‌

21 Aug, 2021 17:06 IST|Sakshi

కాబూల్: అమెరికా సేనల ఉపసంహరణ, తాలిబన్ల అక్రమణ తరువాత అఫ్గానిస్తాన్‌ ఆరని చిచ్చులా రగులుతోంది. తాలిబన్లు అఫ్గాన్‌ భూభాగాలను ఆక్రమించుకోవడం మొదలు తాలీబన్ల హింస, ఆగడాలతో అఫ్గాన్‌  పౌరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  

మొత్తంగా అఫ్గాన్‌ను తమస్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటినుంచి పౌరుల ఆందోళన మరింత  పెరిగింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి ర్యాలీ అయ్యారు. మరోవైపు ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు కాబూల్‌ ఎయిర్‌ పోర్టుకు వేలాదిగా తరలి వచ్చారు. వీరిని అణచివేసేందుకు తాలిబన్లు హింసను  ప్రయోగించారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు.

తుపాకీ మడమలు, రాడ్లు, కొరడాలతో జనాన్ని చితక బాదారు. ఈ క్రమంలో అనేక హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూశాయి. పలు వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో  ఇప్పటికీ  షేర్‌  అవుతున్నాయి.


బిడ్డలనైనా రక్షించాలని తల్లిదండ్రులు తమ చిన్నారులను కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద కంచెపైనుంచి బ్రిటన్‌, అమెరికా సైనికులకు అందించిన దృశ్యాలు. విదేశీ సైనికులు చంటిపాపలను లాలిస్తున్న తీరు కంటతడిపెట్టిస్తోంది. సైనికుల చేతుల్లోకి వెళ్లిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించామని అక్కడి అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు