Afghan Earthquake: శిథిలాల నడుమ అయిన వాళ్ల కోసం.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో

29 Jun, 2022 09:50 IST|Sakshi

వైరల్‌: ఎటు చూసినా శిథిలాలు.. కన్నీళ్లతో అయినవాళ్ల కోసం ఎదురు చూపులు. అద్భుతం జరిగి.. ప్రాణాలతో బయటపడతారేమోననే ఒక ఆశ. కనీసం మృతదేహాలైనా దక్కుతాయని కొందరు.. భూకంపంతో కుదేలైన అఫ్గన్‌ గడ్డపై ప్రస్తుతం కనిపిస్తున్న ఫొటోలు ఇవి. 

ఈ పరిస్థితుల మధ్య గుండెల్ని పిండేస్తున్న ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. ఓ పెంపుడు కుక్క తన ఓనర్ల కోసం పడిగాపులు కాస్తోంది. పాక్‌టికా గ్యాన్‌లోని ఓచ్కీ గ్రామంలో ఓ కుటుంబం భూకంపంలో సజీవ సమాధి అయ్యింది. అయితే వాళ్ల పెంపుడు కుక్క మాత్రం ప్రాణాలతో బయటపడింది. 

చుట్టుపక్కల వాళ్లు తీసుకెళ్లి.. దానికి అన్నం పెడుతున్నారు. అయినా అది ధ్వంసమైన ఆ ఇంటి దగ్గరే కాపలా పుంటోంది. నాశనమైన గోడల వంక చూస్తూ.. తన యజమాని కుటుంబం కోసం పడిగాపులు కాస్తోంది.  

వారం కిందట అఫ్గనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం.. పదిహేను వందల మందికిపైగా పొట్టనపెట్టుకోగా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌ సహా ఎన్నో దేశాలు అఫ్గన్‌కు అండగా నిల్చుంటాయి.

మరిన్ని వార్తలు