నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం

16 Jun, 2021 12:45 IST|Sakshi

ఖాట్మండూ: నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో వర్షం బీబత్సం సృష్టించిందని మధ్య నేపాల్ జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సింధుపాల్‌చౌక్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అరుణ్ పోఖ్రెల్ మాట్లాడుతూ.. మంగళవారం ఎడతెగని వర్షం వల్ల ఇంద్రవతి, మేలంచి నదిలో నీటి మట్టం పెరిగినట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించినట్లు వెల్లడించారు.

కాగా పదుల సంఖ్యలో జనం వదల్లో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వరదల్లో​ చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వర్ష  ప్రభావం  భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో నిరంతర వర్షం కారణంగా బీహార్‌లోని గండక్ నదిలో నీటి మట్టం చాలా వరకు పెరిగింది.

చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు