పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి

4 Mar, 2024 06:02 IST|Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు.  అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్‌ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్‌లను కలిపే కారకోరం హైవే మూతబడింది.

whatsapp channel

మరిన్ని వార్తలు