ఆగని కార్చిచ్చు.. పైలట్‌ మృతి

20 Aug, 2020 09:20 IST|Sakshi

కాలిఫోర్నియాలో మంటలను ఆర్పుతుండగా.. విమానం బ్లాస్ట్‌ 

వాషింగ్టన్‌: కాలిఫోర్నియాలో చేలరేగిన కార్చిచ్చు చల్లారడం లేదు. మంటలను ఆర్పడానికి పోరాడుతున్న ఒక హెలికాప్టర్ కూలడంతో పైలట్‌‌ చనిపోయాడు. గడిచిన 72 గంటల్లో కాలిఫోర్నియా దాదాపు 11,000 మెరుపు దాడులకు గురయ్యింది. ఫలితంగా 367 మంటలు చెలరేగాయి. ఉత్తర కాలిఫోర్నియా వైన్ ప్రాంతంలో 50 కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నివసిస్తున్న వేలాది మంది తమ ఇళ్ల నుంచి పారిపోయారు. సెంట్రల్ కాలిఫోర్నియాలో, శాన్ఫ్రాన్సిస్‌కోకు దక్షిణాన 160 మైళ్ళు (258 కి.మీ) దూరంలో ఫ్రెస్నో కౌంటీలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఒక హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో అందులో ఉన్న పైలట్ మృతి చెందాడని కాలిఫోర్నియా అటవీ,అగ్నిమాపక రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

శాన్ఫ్రాన్సిస్‌సోకు ఉత్తరాన, వాకావిల్లే నగరానికి సమీపంలో 46,000 ఎకరాల (18,615 హెక్టార్ల) విస్తీర్ణంలో కొండలు, పర్వత ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. ఫలితంగా 50 గృహాలు, ఇతర నిర్మాణాలు కాలి బూడిద అయ్యాయి. సాక్రమెంటోకు నైరుతి దిశలో 30 మైళ్ళ దూరంలో 100,000 మంది నివసిస్తున్న నగరంలో పాక్షిక తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్‌ఎన్‌యు లైట్‌ కాంప్లెక్స్ ఫైర్‌గా పిలవబడే అగ్ని కీలలు పడమటి వైపున ఉన్న గృహాలను తగలబెట్టాయి. జనాలు తమ పశుసంపదను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. చనిపోయిన పశువులు, ఆస్తులకు సంబంధించిన ఫోటోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడు ఇంత తీవ్రమైన మంటలను చూడలేదు. ఎన్నడు లేని వినాశకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాము’ అని తెలిపారు. (వైరల్‌ వీడియో: మంటలార్పడానికి వెళ్తే..)

2017 లో ఉత్తర కాలిఫోర్నియా అంతటా మంటలు సంభవించాయి. ఫలితంగా  44 మంది చనిపోయారు. అనేక వైన్ తయారీ కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 9,000 గృహాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. పాలో ఆల్టోకు తూర్పున 20 మైళ్ళ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఎస్‌సీయూ ఫైర్‌ కాంప్లెక్స్‌గా పిలువబడే మంటలు రాత్రికి రాత్రే రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం 85,000 ఎకరాలకు పైగా మంటలు విస్తరించాయి. ఆగస్టు సీజడ్‌యూ ఫైర్‌ కాంప్లెక్స్‌ వల్ల చేలరేగిన మంటలు సుమారు 10,000 ఎకరాలకు పైగా వ్యాపించాయి. అలానే పశ్చిమాన, కరువుతో బాధపడుతున్న కొలరాడో బుధవారం చరిత్రలో రెండవ అతిపెద్ద అడవి మంటను ఎదుర్కొంది. పైన్ గుల్చ్ బ్లేజ్ 125,100 ఎకరాలలో కాలిపోవడమే కాక ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ మంటల విస్తీర్ణం వ్యాప్తి డెన్వర్ నగరం కంటే అధికంగా ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు