-

MAX The Dog: బతికుండగానే విగ్రహం! ఎందుకంటే..

4 Jul, 2021 10:28 IST|Sakshi

ఏదో గొప్ప పనులు చేయడమో.. లేదంటే జనాలకు బాగా దగ్గర అయినవాళ్లు విగ్రహాలను రోడ్ల మీద చూస్తుంటాం. అలాంటిది ఓ కుక్కకు.. అదీ బతికుండగానే కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు వాయవ్య ఇంగ్లండ్‌లో. ఎందుకంటారా?.. 

లండన్‌: పదమూడేళ్ల మ్యాక్స్‌.. ఒక థెరపీ డాగ్‌.  కుంబ్రియాలోని కెస్విక్‌లో అది జనాల ఆదరణ చురగొంటోంది. లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటిదాకా అది పదివేల మందికి ప్రశాంతతను అందించింది. ఇందుకుగానూ ఈ ఫిబ్రవరిలో దానికి మెరిట్‌ సర్టిఫికెట్‌ కూడా అందించారు. ఇక ఇప్పుడు ఏకంగా విగ్రహం పెట్టించారు. ది మిరకిల్‌ డాగ్‌ అనే బిరుదును దీనికి ఇచ్చారు.

ఆ ట్యాగ్‌ లైన్‌కు తగ్గట్లే మ్యాక్స్‌ అద్భుతాలు చేస్తుంది. పుట్టినరోజులకు గ్రీటింగ్స్‌ అందజేయడం, ఛారిటీ వాక్స్‌లో పాల్గొనడం, స్కూల్‌ పిల్లలతో సరదాగా ఆడుకోవడం, ఒంటరితనం భరించలేనివాళ్లతో కాసేపు గడపడం.. ఇలా అందరిలో ఆనందాన్ని నింపుతోంది. అంతేకాదు ఛారిటీల ద్వారా అది ఏకంగా మూడు లక్షల పౌండ్లు వసూలు చేయడం విశేషం. ఇక హోప్‌ పార్క్‌ బయట దాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బహుశా బతికుండగానే ఈ గౌరవం అందుకున్న మొదటి మూగ జీవి ఇదేనేమోనని అక్కడి అధికారులు చెప్తున్నారు. 

రోడ్డు మీద నుంచి.. 
ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో దానిని ఎవరో రోడ్డు మీద వదిలేశారు. 2008లో కెర్రీ ఇర్వింగ్‌ దానిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. 2016 నుంచి దానికి థెరపీ డాగ్‌ ట్రైనింగ్‌ ఇప్పించాడు కెర్రీ. కాగా, మ్యాక్స్‌ విగ్రహాన​ క్రిస్టీ అనే కళాకారుడు తయారు చేయగా.. సోఫి అనే పన్నెండేళ్ల చిన్నారి చేత మ్యాక్స్‌గాడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు.

చదవండి: ఎక్కడ చూసినా వేడి.. ఉక్కపోత! ఎందుకో తెలుసా?

మరిన్ని వార్తలు