హాంకాంగ్‌లో మీడియాపై... జాతీయ భద్రతా చట్టం ప్రయోగం

18 Jun, 2021 04:01 IST|Sakshi
చీఫ్‌ ఎడిటర్‌ రేయాన్‌లా

యాపిల్‌ డైలీ పత్రిక ఎడిటర్లు, కార్యనిర్వాహకుల అరెస్టు

హాంకాంగ్‌: చైనా పాలకుల కర్కశత్వానికి మరో తార్కాణం. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య గళాలను అణచివేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తొలిసారిగా మీడియాపై ప్రయోగించారు. యాపిల్‌ డైలీ అనే పత్రికకు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహకులను పోలీసులు ఈ చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ పత్రికలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ వార్తలను ప్రచురిస్తుంటారు. హాంకాంగ్‌కు చైనా చెర నుంచి విముక్తి లభించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలని యాపిల్‌ డైలీ గట్టిగా నినదిస్తోంది. చైనా, హాంకాంగ్‌పై ఇతర దేశాలు ఆంక్షలు విధించేలా కుట్ర పన్నడమే ధ్యేయంగా 30కిపైగా ఆర్టికల్స్‌ను ఈ పత్రిక ప్రచురించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు