Human Waste Falling From Sky: విమానంలోంచి కుప్పలుగా..యాక్‌..ఛీ!

21 Oct, 2021 15:40 IST|Sakshi

మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే  జనం ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా  వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా.  బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది.  గార్డెన్‌లో పనిచేసుకుంటున్న  మనిషి అటుగా   వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్‌ వెదర్‌ రిపోర్ట్‌లో.. ఆ క్లిప్పింగ్‌)

తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్‌లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లోని విండ్సర్‌  సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కూడా బాధితుడు  విముఖత  వ్యక్తం చేయడం  గమనార్హం. (kidney transplantation: సంచలనం)

విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్‌ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్‌ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత  వాటిని  తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్‌లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు.

మరిన్ని వార్తలు