హౌతీ మిస్సైల్స్‌ కూల్చేసిన యూఏఈ

25 Jan, 2022 06:30 IST|Sakshi

దుబాయ్‌: రాజధాని అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్లు యూఏఈ సోమవారం ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిప్సైల్‌ లాంచర్‌ను యూఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను యూఏఈ రక్షణ శాఖ ట్వీట్‌ చేసింది. ఎలాంటి దాడులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.  

మరిన్ని వార్తలు