ఆక్రమిత ప్రాంతాల్లో చరిత్ర, మనుషుల పేర్లు మార్పు

10 Sep, 2020 17:42 IST|Sakshi

ఇంటర్నెట్‌పై నియంత్రణ

అనుకూల రీతిలో గ్రంథాల అనువాదం

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా వ్యూహాలు, ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ఏ విధంగా వ్యవహరిస్తుంది వంటి అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్రమిత ప్రాంతాల్లో చైనా పాటించే విధనాలు ఏంటో చూడండి. ప్రపంచంలో ప్రతి దానికి చైనా తన సొంత పేర్లు పెడుతుంది. భూమి కానీ.. మనుషులు కానీ ఏదైనా సరే. బలవంతంగా ఆక్రమించిన ప్రాంతంలో మనుషులను తన డిక్షన్‌లోకి మార్చుకుంటుంది డ్రాగన్‌ దేశం. దానిలో భాగంగానే ముస్లింలను చైనా సంస్కృతిలో కలపడానికి గాను ఇస్లామిక్‌ పేర్ల మీద నిషేధం విధించింది. అంతేకాక వారికి సంబంధించిన మత గ్రంథాలను తనకు అనుకూలంగా మార్చుకుంది చైనా. ఆఖరికి మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని సైతం వదలలేదు. అ‍క్కడి మీడియా, ప్రెస్‌ నోట్లలో వారి పేర్లను చైనీస్‌లోకి అనువాదం చేసి సు జీషెంగ్‌, టాంగ్నాడే తెలాంగ్‌పు అని పేర్కొంటుంది. విషయాలను స్వంతం చేసుకోవడమే ఇక్కడ దాని ప్రధాన ఆలోచన. (చదవండి: వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలు రద్దు!)

ఇక చైనా తాను ఆక్రమించిన ప్రాంతాల చరిత్రను మార్చడానికి వాటికి కొత్త పేర్లను పెడతుంది. 1950-60 మధ్య టిబెట్‌ విషయంలో ఇదే జరిగింది. దాని పేరును జిజాంగ్‌(వెస్ట్రన్‌ త్సాంగ్‌)గా మార్చగా.. తూర్పు తుర్కెస్తాన్‌ పేరును జిన్జియాంగ్‌గా మార్చింది. జిజాంగ్‌ అంటే పాశ్యాత్య ధూళి అని అర్థం. టిబెట్లను అవమానించే ఉద్దేశంతో చైనా ఈ పేరు పెట్టింది. పేరు మార్చడం పూర్తయ్యాక ఆ ప్రాంతానికి సంబంధించి అసంబద్ధమైన వాదనలను తెర మీదకు తెస్తుంది. టిబెట్‌ విషయంలో ఇదే జరగింది. టిబెటన్‌ బౌద్ధమతం ఇన్నర్‌ మంగోలియాలో ఉద్భవించింది అనే హాస్యాస్పదమైన వాదనను తెరమీదకు తెచ్చింది. ఇక్కడ చైనా ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టిబెటన్‌ల మీద భారతీయ ప్రభావాన్ని దూరం చేయడం.

ఇస్లామిక్‌ పేర్లను నిషేధించడం
ముస్లిం ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించిన చైనా అ‍క్కడి వారిని పూర్తిగా తనలో కలుపుకుంటుంది. దానిలో భాగంగానే ఇస్లామిక్‌ పేర్లను నిషేధిస్తుంది. ప్రస్తుతం జిన్జియాంగ్‌గా పిలువబడే తూర్పు తుర్కెస్తాన్‌లోని చురుకైన ప్రాంతాల్లో నుంచి ఇస్లాం ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడానికి చైనా దేశంలో 29 ఇస్లామిక్‌ పేర్లను నిషేధించింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఈ పేర్లతో జననమరణాలను రిజిస్టర్‌ చేయడం.. పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకోవడం అసాధ్యం. అంతేకాక ఈ‌ పేరు ఉంటే పాఠశాలలు మొదలు.. యూనివర్సిటీల వరకు ఎక్కడా ప్రవేశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించవు. ఇక్కడ చైనా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉయ్‌ఘర్‌ సమాజాన్ని పూర్తిగా లొంగదీసుకుని తనలో కలుపుకోవడమే. (చదవండి: ముదురుతున్న వివాదం)

ఇంటర్నెట్‌ని‌ ప్రభావవంతంగా వాడటం
చైనా జనాభా 1.42 బిలియన్లు. ప్రపంచ మొత్తం జనాభాలో ఐదొంతుల మంది ఇక్కడే ఉన్నారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఇంటర్నెట్‌కి ఉందని అర్థం చేసుకున్న చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ(సీసీపీ) ఇంటర్నెట్‌ని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంది. చైనా విదేశాంగ విధానాలకు అనుగుణంగా దేశీయ, ప్రపంచ రంగాలపై అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి షాంఘై యూనిట్‌ 61398 వంటి పీఎల్‌ఏ సైబర్‌ క్రైమ్‌ బ్రిగేడ్‌ను సీసీపీ చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. 

గ్రంథాలు, పుస్తకాలను అనువదించడం
టిబెటన్ జనాభాను చైనీస్ భాషలో చదవమని బలవంతం చేయడానికి చైనా వేదాంత సంస్థలలోని అన్ని బౌద్ధ గ్రంథాలను అనువదించడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2018 లో లాసా జోఖాంగ్ ఆలయాన్ని తగలబెట్టడం.. టిబెటన్ బౌద్ధమతంలో అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన ప్రదేశాలలో పాత బౌద్ధ గ్రంధాలన్నింటినీ తగలబెట్టే ప్రయత్నం చేసింది. వీటిని నాశనం చేసి చైనీస్ భాషలో కొత్త పుస్తకాలు ప్రచురించింది. ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశం ఇక మీదట ఆక్రమిత టిబెట్‌లోని కొత్త తరం సన్యాసులు బీజింగ్‌కు దగ్గరగా ఉండటమే కాక వారి మీద సీసీపీ ప్రభావంతో ఉంటుంది.

ఇటువంటి చర్యలతో, చైనా అది ఆక్రమించిన కమ్యూనిటీలు, భూముల గుర్తింపును పూర్తిగా మార్చివేస్తోంది. దీనిలో భాగంగా హాన్ సమాజం, మధ్య సామ్రాజ్యం జాంగ్గువో మినహా అన్నింటినీ తుడిచివేసింది.

మరిన్ని వార్తలు