అఫ్గనిస్తాన్‌ పునర్‌ నిర్మాణంలో హైదరాబాద్ కంపెనీ

18 Aug, 2021 20:56 IST|Sakshi

గతంలో అఫ్గనిస్తాన్‌ లో జరిగిన యుద్దం వల్ల ఆ దేశ పునర్‌ నిర్మాణంలో హైదరాబాద్ కు చెందిన కంపెనీ భాగస్వామ్యం అయ్యింది. ఈ సందర్భంగా బీఎస్ సీపీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. గతంలో యుద్దం వల్ల దెబ్బతిన్న దేశ పునర్‌ నిర్మాణంలో భాగంగా నాలుగు కంపెనీలు 360 కిమీ విస్తరణ పనులు చేపట్టాయి. అందులో మూడు టర్కీ దేశానికి చెందినవి. 85 కి.మీ దూరాన్ని పునర్‌ నిర్మించడానికి హైదరాబాద్ కు చెందిన  బీఎస్ సీపీఎల్ కు ఒక సంవత్సరం పట్టింది. ఇదంతా 2003లో జరిగినట్లు పేర్కొన్నారు.  

అయితే, ఈ ప్రాజెక్టు పూర్తికాగానే ఆ దేశం ‎తనను‎ రాష్ట్రపతి ప్యాలెస్ లో జరుగుతున్న విందుకు ఆహ్వానం లభించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తర్వాత 8-9 సంవత్సరాల కాలంలో కాబూల్ లోని పార్లమెంటు భవనానికి ఒప్పందం కుదిరే వరకు ఏడు రోడ్డు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. "కాబూల్ లోని పార్లమెంటు భవనానికి నిర్మాణానికి ఐదు స౦వత్సరాలు పట్టి౦ది, కానీ అది ప్రత్యేకమైనది" అని ఆయన అన్నారు. ఆ ఒప్పందం విలువ సుమారు రూ.850 కోట్లు. ఆఫ్ఘనిస్తాన్ లో బీఎస్ సీపీఎల్ 2,300 కోట్ల విలువైన పనులు చేపట్టింది. "ఆ తర్వాత మరో ఉన్నత స్థానం భారత రాయబార కార్యాలయాన్ని నిర్మించడం. ఇది 2008లో బాంబు దాడికి గురైంది. దాన్ని పునర్నిర్మించడం వేరే అనుభవం" అని అన్నారు. అక్కడ ఉన్న ప్రతి రోడ్డు గురుంచి తనకు తెలుసు అని అన్నారు.

సవాళ్లతో కూడిన పని
"అక్కడ పనులు చేపట్టడం ఎల్లప్పుడూ సవాలుగా ఉండేది కాని ఇంత దారుణం కాదు. మా పని 2013లో మందగించడం ప్రారంభించింది. అప్పటి నుంచి చెడు సంకేతాలు వచ్చినట్లు" అని ఆయన వివరించారు. అప్పటి వరకు శిక్షణ పొందిన స్థానికులతో పాటు అతని స్వంత సిబ్బందిలో 60-70 మంది అక్కడే ఉన్నారు. తొలి దశలో ఇద్దరు ఉద్యోగులను(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరూ) కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపడం ఇబ్బంది కలిగించినట్లు అన్నారు. కార్లు దొంగలించడం, క్లిష్టమైన యంత్రాలను తగలబెట్టడం రాను రాను పరిస్థితి క్షీణించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు