అమ్మాయిలు ఎన్ని రోజులకు ఐ లవ్‌ యూ చెబుతారు? ఆశ్చర్యపరుస్తున్న రిపోర్టు!

15 Aug, 2023 13:47 IST|Sakshi

గర్ల్‌ఫ్రెండ్‌ తనబాయ్‌ ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెప్పడానికి ఎన్నిరోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించిన పరిశోధకులు పలు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ఎవరైనా యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని పరిశోధకులు తెలిపారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు.  

ఈ పరిశోధనను స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఎబర్ట్‌  యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ది బ్రిటీష్‌ సైకలాజికల్‌ సొసైటీ ద్వారా వెలువడిన ఈ రిపోర్టులో విభిన్న సంస్కృతులు కలిగిన పలుదేశాల్లోని యువకుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ బృందం ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్‌,పోలాండ్‌,యూకేలకు చెందిన 3,109 మంది యువతీయువకులను ఈ పరిశోధనలో భాగస్వాములను చేసింది. వీరిలో 70 శాతం మంది యువతులు, 30 శాతం మంది యువకులు ఉన్నారు. 

వారి ముందు కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వారు భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్‌ యూ చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 60 శాతం యువకులు తమ గర్ల్‌ప్రెండ్‌కు 69 రోజుల తరువాత ఐ లవ్‌ యూ చెప్పారని వెల్లడయ్యింది. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఐ లవ్‌ యూ చెబుతుంటారని వెల్లడయ్యింది. యువతులు ఐ లవ్‌యూ చెప్పేందుకు కనీసంగా 77 రోజులు తీసుకుంటారని, గరిష్టంగా 122 రోజల సమయం తీసుకుంటారని పరిశోధనలో వెల్లడయ్యింది. 
ఇది కూడా చూడండి: సీమా హైదర్‌, అంజూ తరహాలో రాజస్థాన్‌ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. 

మరిన్ని వార్తలు