Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి

26 Aug, 2021 20:17 IST|Sakshi

అప్గానిస్తాన్‌లో వరుస పేలుళ్ల బీభత్సం

ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న అమెరికా రక్షణ శాఖ

ఇప్పటికే  హెచ్చరించిన అమెరికా 

కాబూల్‌: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటినుంచీ హింస మరింత రగులుతోంది. తాజాగా కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద జంట పేలుళ్ల ఘటనలు బీభత్సం సృష్టించాయి. హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయం అబేగేట్‌,  ఒక హోటల్‌వద్ద వరుసగా భారీ  పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, తాలిబన్‌ ప్రతినిధి  రాయటర్స్‌తో తెలిపారు. అటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు దీన్ని ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు  అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

కాగా పేలుళ్లు జరిగే అవకాశ ఉందని ముందే హెచ్చరించిన అమెరికా తాజాగా మరింత అప్రమత్తమైంది. మరో పేలుడు కూడా జరిగే అవకాశం ఉందని అమెరికా ఆర్మీ హెచ్చరించింది.  కాబుల్‌ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుళ్ళు  ఘటనలు మరింత ఆందోళన రేపాయి. 


 

మరిన్ని వార్తలు