వైరల్‌: రికార్డు సృష్టించిన కొండచిలువ

9 Oct, 2020 16:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఫ్లోరిడాలో అత్యంత పొడవైన కొండచిలువను స్థానిక వేటగాళ్లు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఫ్లోరిడాలోని వాటర్‌ మేనేజ్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌లో గుర్తించిన ఈ ఆడ కొండచిలువ పొడువు 18.9 అడుగులు. ఇది ఇప్పటి వరకు 18.8 అడుగుల పొడవున్న కొండచిలువ రికార్డును చెరపేసి కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ర్యాన్‌ ఆస్‌బర్న్‌, అతని స్నేహితుడు కెవిన్‌ పావ్లిడిస్‌ ఇద్దరూ పాముల వేటగాళ్లు. వైల్డ్‌ లైఫ్‌ సొసైటీలో పనిచేసే వీరు వవిధ ప్రాంతాలలో తిరుగుతూ పాములను పట్టుకొని వారి సంస్థకు అప్పజెప్పుతారు. చదవండి: బ్లూ స్నేక్‌.. కనిపించేంత సాఫ్ట్‌ కాదు సుమీ..

ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వేటలో నడుము లోతులో ఉన్న నీటిలో దిగి ఈ భారీ కొండ చిలువను పట్టుకున్నారు. తాజాగా లభించిన కొండ చిలువ బరువు 47 కిలోలు. ఈ విషయాన్ని పావ్లిడిస్‌ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఇంత పెద్ద పామును మునుపెన్నడూ చూడలేని, దాన్ని పట్టుకునేటప్పుడు చేతులు వణికాయని పావ్లిడిస్‌ పేర్కొన్నారు.  కొండచిలువ కొత్త రికార్డు సృష్టించినట్లు ఫ్లోరిడా ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషన్‌ కమిషన్‌ ధృవీకరించింది. చదవండి:  నోటిలో నుంచి 4 అడుగుల పాము..

మరిన్ని వార్తలు