మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన

12 Sep, 2020 12:12 IST|Sakshi

వాషింగ్టన్‌: యూఎస్‌లోని కాలిఫోర్నియా అడవులలో ఆగస్టులో చెలరేగిన మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. అమెరికాలోని మూడు వెస్ట్‌ కోస్ట్ రాష్ట్రాలలో ఈ మంటలు వ్యాపించాయి. దీంతో ఒరెగానేలో ఐదు లక్షల మందిని ఆ ప్రాంతం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. ఒరెగానేలో చిన్నగా మంటలు చెలరేగాయని, రాష్ట్ర అత్యవసర నిర్వహణ అధికారులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని  తెలిపారు. ఇక  మెలిల్లా నగరం మొత్తం పొగతో నిండిపోయింది.

దీంతో అక్కడ ఉంటున్న 9000 మందిని ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వీరిలో అందరూ నగరాన్ని విడిచి వెళ్లడానికి అంగీకరించినా కేవలం 30 మంది మాత్రమే తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించలేదు. వర్షం మాత్రమే ఈ మంటలు ఆగటానికి సహకరించగలదని, గాలి వేగం తగ్గడం, తేమశాతం పెరిగితే ఫైర్‌ ఫైటర్స్‌కు కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ప్రకృతి తమకు అనుకూలిస్తుందని భావిస్తున్నట్లు అటవీ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: చల్లారని కాలిఫోర్నియా కార్చిచ్చు

మరిన్ని వార్తలు