ఆలుమ‌గ‌ల గొడ‌వ‌: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్‌

28 Jul, 2020 17:55 IST|Sakshi
ఫొటో సోర్స్‌: ఓరియంట‌ల్ డెయిలీ

కౌలాలంపూర్: భార్యాభ‌ర్త‌ల‌న్నాక స‌వాల‌క్ష గొడ‌వ‌లుంటాయి. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎవ‌రో ఒక‌రు స‌ర్దుకుపోవాల్సిందే. అయితే మలేషియాలో మాత్రం ఓ జంట గొడ‌వ‌ యూట్యూబ్ అభిమానుల‌కు కోపం తెప్పించింది. అది ఎలాగో చ‌దివేయండి.. మ‌లేషియాకు చెందిన ఎం.సు‌గు, ఎస్‌.పవిత్ర భార్యాభ‌ర్తలు. వీరిద్ద‌రూ కలిసి ఇద్ద‌రి పేరు వ‌చ్చేలా "సుగు పవిత్ర" అనే యూట్యూబ్ చాన‌ల్ పెట్టారు. అందులో రుచిక‌ర‌మైన‌ వంట‌కాల వీడియోల‌ను అప్‌లోడ్ చేసేవారు. వీరు చేసే వంట‌లు న‌చ్చి, త‌యారీ విధానం మెచ్చి 7.8 లక్ష‌ల మంది ఈ ఛాన‌ల్‌ను ఫాలో అవుతున్నారు. గ‌తేడాది జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 98 వీడియోల‌ను చేశారు. అయితే జూలై 20న ఈ ఆలుమ‌గ‌ల మ‌ధ్య  గొడ‌వ జ‌రిగింది. (అనుకోని అతిధి రాకతో అద్భుతం..)

ఈ క్ర‌మంలో త‌ర్వాతి రోజు పూటుగా తాగిన సుగు త‌న‌ భార్య‌పై కొడ‌వలితో దాడి చేశాడు. ఆమె గృహ హింస కింద భ‌ర్త‌పై కేసు పెట్టింది. దీంతో సుగు భార్య‌పై కోపంతో యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఉన్న అన్ని వీడియోల‌ను డిలీట్ చేశాడు. దీంతో వారికి ఉన్న ఏకైక ఆదాయం పోయిన‌ట్లైంది. మ‌రోవైపు మీరు మీరూ త‌గవులాడుకుని మ‌ధ్య‌లో వీడియోలు ఎందుకు డిలీట్ చేశార‌ని ఆ ఛాన‌ల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న‌వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం అక్క‌డ సుగు పవిత్ర ఛాన‌ల్ పేరు మార్మోగిపోతోంది. అయితే పవిత్ర త‌న భ‌ర్త‌ను క్ష‌మించివేసిన‌ట్లు, త‌న కేసు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు మలేషియా మీడియా పేర్కొంది. త్వ‌ర‌లోనే వీళ్లిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ కొత్త వీడియో కూడా చేయ‌నున్నార‌ట‌. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు