భార్య గుట్టు ర‌ట్టు చేసిన గూగుల్ మ్యాప్‌

12 Aug, 2020 20:16 IST|Sakshi

లిమా: గూగుల్ మ్యాప్ సాయంతో ఏ ప్రాంతాన్నైనా అల‌వోక‌గా చుట్టిరావొచ్చు. ఎక్క‌డి ప్ర‌దేశాన్నైనా కూర్చున్న‌చోటే చూసేయొచ్చు. ముఖ్యంగా మ‌న ఇంటిని, వీధిని కూడా గూగుల్ మ్యాప్స్‌లో చెక్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో వీధిలో ఎక్క‌డేం జ‌రుగుతుందో కూడా తెలుసుకోవ‌చ్చు. అయితే గూగుల్ మ్యాప్ వ‌ల్ల కొన్ని స‌ర‌దా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ ఓసారి మాత్రం భార్యాభ‌ర్త‌ల‌ మ‌ధ్య చిచ్చు పెట్టి వారిని వేరు చేసింది. అమెరికాలోని పెరూ రాష్ట్ర‌ రాజ‌ధాని లిమాలో చెందిన‌ ఓ వ్య‌క్తి గూగుల్ మ్యాప్ తెరిచి స్ట్రీట్ వ్యూ చూశాడు. ఇంత‌లో వీధిలోని బ‌ల్ల‌పై ఓ మ‌హిళ, ఆమె ఒడిలో ఓ వ్య‌క్తి సేద‌తీరుతూ క‌నిపించారు. ఇంత క్లోజ్‌గా‌ ఊసులాడుకుంటున్న వీళ్ల‌పై అత‌నికి ఎందుకో అనుమానం వేయ‌డంతో జూమ్ చేసి చూశాడు. (వైరల్‌: ‘నిజమైన కుక్కను కనుక్కోవడం కష్టమే’)

తీరా అక్క‌డున్న‌ది ఎవ‌రో కాదు, త‌న అర్ధాంగే అని తెలిసి అత‌ని గుండె ప‌గిలినంత ప‌నైంది. భార్య గుట్టు రట్టు కావ‌డంతో దాన్ని ఫొటో తీసి, ఇంటికెళ్లాక ఆమెకు చూపించాడు. అందులో ఉన్న‌ది తాను కాద‌ని ముందుగా బుకాయించిన‌ప్ప‌టికీ త‌ర్వాత ఆమె నిజాన్ని అంగీక‌రించ త‌ప్పలేదు. దీంతో ఆయ‌న.. భ‌ర్త ఉండ‌గానే వేరే వ్య‌క్తితో సంబంధం పెట్టుకున్న ఆమె త‌న‌కు ఇల్లాలుగా ప‌నికి రాదంటూ కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నాడు. 2013లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న మ‌రోసారి ట్రెండింగ్ అవుతోంది (గూగుల్‌నే ఫూల్‌ చేశాడు!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా