వీడియో: చైనాను అభినందిస్తున్నా.. టంగ్‌స్లిప్‌ అయిన బైడెన్‌

25 Mar, 2023 20:50 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తడబాటు పరిపాటిగా మారిపోయింది. తరచూ తప్పిదాలతో వార్తల్లో నిలుస్తుంటారాయన. అంతేకాదు ఆ పెద్దాయన చేష్టలు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా కెనడాకు వెళ్లిన ఆయన ఆ దేశ పార్లమెంట్‌లో ఆ దేశాన్నే పొగడాల్సిందిబోయి.. చైనా పేరును ప్రస్తావించి నాలుక కర్చుకున్నారు.

కెనడా మైగ్రేషన్‌ పాలసీల గురించి తాజాగా కెనడా పార్లమెంట్‌లో జో బైడెన్‌ ప్రసంగించారు. ఏటా 15వేల మంది శరణార్థులను లాటిన్‌ దేశాల నుంచి కెనడాలోకి అంగీకరించినందుకు బైడెన్‌ అభినందించాలనుకున్నారు. ప్రసంగించే సమయంలో.. ఇవాళ నేను చైనాను అభినందించేందుకు..! అంటూ ఒక్కసారిగా ఆగిపోయారాయన. క్షమించండి, నేను కెనడాను అభినందిస్తున్నాను. నేను ఏమి ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరు.  చైనా గురించి.. నేను ఇంక ఆ ప్రస్తావన తేను అంటూ.. నవ్వులు పూసిన హాల్‌లో బైడెన్‌ తన ప్రసంగం కొనసాగించారు. 

ఈ వీడియోపై ట్రంప్‌ తనయుడు ఎరిక్‌ ట్రంప్‌ స్పందించాడు. అమెరికాకు ఇది సిగ్గుచేటు పరిణామం అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. అదే రోజు జరిగిన మీడియా సమావేశంలో బైడెన్‌ ఇలాంటి పొరపాటే మళ్లీ చేశారు. చైనా రష్యాల మధ్య సంబంధం గురించి మాట్లాడుతూ.. పొరపాటున మధ్యలో జపాన్‌ అనబోయారు ఆయన. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు