మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!

9 Jan, 2022 09:14 IST|Sakshi

Woman thought husband wanted a divorce: మన జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించకుండానే హఠాత్తుగా జరిగిపోతుంటాయి. అంతేగాదు అవి ఒక్కోసారి మనకు మంచి ఆనందాన్నిఇస్తే మరికొన్ని సంఘటనలు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. ఐతే మన అనుకున్న వాళ్లు చిన్న మాట అనగానే అపార్థం చేసుకుని అభద్రత భావానికి గురవుతాం. కానీ వాళ్లు మన మంచికోరే వాళ్లని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. అచ్చం అలానే స్పెయిన్‌కి చెందిన ఒక మహిళతో తన భర్త హఠాత్తుగా ఒక విషయం గురించి సీరియస్‌గా మాట్లాడాల్సి ఉందనంగానే ఆమె దారుణంగా ఊహించుకుని భయపడింది. భర్త ఊహించని సర్‌ఫ్రైజ్‌ ఇవ్వడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగినంతపనైంది.

(చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!)

అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌కి చెందిన టెర్రీ ఎడ్గెల్ అతని భార్య జూడ్  తాము సెలవుల్లో హాయిగా గడిపేందుకు ఒక మంచి ఇల్లు కోసం వెతుకుతున్నారు. ఐతే టెర్రీ ఎడ్గెల్ తన భార్య జూడ్‌కి కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్ల పెన్లిన్ కోటలో నివశించాలనేది చిన్ననాటి కల. అందుకోసం ఆమెకు తెలియకుండా వేలంలో రూ. 5 కోట్లకు ఆ కోటను కొన్నాడు. అంతేకాదు ఆమెను ఆ కోటకు తీసుకువెళ్లి సర్‌ఫ్రైజ్‌ చేయాలనుకున్నాడు.

ఈ మేరకు టెర్రీ ఎడ్గెల్ ఒకరోజు తన భార్యను పిలిచి నీతో చాలా సీరియస్‌ ఒక విషయం గురించి మాట్లాడాలని చెబుతాడు. దీంతో భర్త తనను వదిలించేసుకోవాలనుకుంటున్నాడు, బహుశా విడాకులు ఇచ్చేస్తాడేమో! అందుకోసమే ఇలా అంటున్నాడని భయపడుతుంది. ఐతే ఆమెకు ఇష్టమైన కోట దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. అంతే! ఒక్కసారిగా ఆమె షాక్‌కి గురై ఎగిరిగంతేసింది. ఈ మేరకు జూడ్‌ తాను చాలా భయపడ్డానని, కళ్లు తిరిగినంత పనయ్యిందని అంటోంది. ప్రస్తుతం తనకు చాలా ఆనందంగా ఉందని. పైగా తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడూ ఇలాంటి ఇల్లు కావాలని అనుకున్నట్లు మీడియాకు చెప్పుకొచ్చింది.

అయితే ఫారెస్ట్ గ్రూప్ సీఈవో అయిన టెర్రీ చాలా బిజీగా ఉండటంతో ఆ కోట పునరుద్ధరణ పనులన్నీ జూడ్‌ దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు ఆమె సైట్ మేనేజర్, స్పెషలిస్ట్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్, ఆర్కియాలజిస్ట్, హెరిటేజ్ స్పెషలిస్టులు, ఇంజనీర్‌తో సహా స్పెషలిస్ట్ ట్రేడ్ వర్కర్ల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ కోటను సరికొత్త హంగులతో తీర్చి దిద్దేందుకు సమయాత్తవుతోంది జూడ్‌. ఈ మేరకు ఆ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మూడేళ్లు పడుతుందని, 2024 కల్లా ఆ కోటలోకి ప్రవేశించాలని ఎదురుచూస్తున్నట్టు ఆ జంట చెబుతోంది.

(చదవండి: డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. మత్తిచ్చి చంపి తినేశాడు!)

మరిన్ని వార్తలు