ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!

6 Nov, 2021 18:03 IST|Sakshi

మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడూ తినుబండరాలను కూడా తీసుకువెళ్లాం. కాల‍క్షేపం కోసం లేక మనం వెళ్లిప్రాంతాల్లో తినే పదర్ధాలు ఏవైన దొరక్కపోవచ్చు అందువల్ల ఏదో ఒక తినుబండరాలను తీసుకువెళ్తారు. అయితే అవి మనకు వీలుగా ఉండేవి ఇతరు ప్రయణికులకు ఇబ్బంది కలిగించినవి తీసుకువెళ్తాం కానీ ఇక్కడ ఒక ఆమె ఏకంగా విమానంలో ఒక కాల్చిన చేపను తీసుకువెళ్తుంది.

(చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి)

పైగా ఆ చేప వాసన విమానం అంతా వ్యాపించడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురువుతారు. విమాన నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో ఇలాంటి ప్రిజర్వేటడ్‌ ఫుడ్‌ని తీసుకువెళ్లడానికి అంగీకరించవు. అయితే చాలామంది ప్రయాణికులు ఏదోరకంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే సదరు ప్రయాణికురాలు దీనికి సంబంధించిన ఫోటోతో పాటు " నేను మాత్రమేనా ఇలాంటి ఆహారం విమానంలో తీసుకువెళ్లేది" అంటూ క్యాప్షన్‌ జోడించి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఇలాంటి ఆహారం విమానంలోకి తీసుకువెళ్తారా అంటూ విమర్శిస్తూ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.

(చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు)

మరిన్ని వార్తలు