IMAX: జేబులో ఐమాక్స్‌.. అరచేతిలో యూట్యూబ్‌, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు

14 May, 2022 07:53 IST|Sakshi

జేబులో ఐమాక్స్‌... అంత పెద్ద థియేటర్‌ మన జేబులో పట్టడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే.. కాకపోతే థియేటర్‌ కాదు. ఆ స్క్రీన్‌ను తలపించే కళ్లద్దాలు వచ్చేశాయి. ఇంట్లో, కారులో, బయట ఎక్కడంటే అక్కడ కూర్చుని థియేటర్‌ యాంబియెన్స్‌తో మీ ఫోన్లోని సినిమాలు, వీడియోలు చూసేయొచ్చు. అరచేతిలో అంతపెద్ద స్క్రీన్‌ను చూపించే ఆ కళ్లద్దాల కథేమిటో తెలుసుకుందాం.  

బ్రిటిష్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఈఈ (ఒకప్పటి ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌) ఈ ‘ఎన్‌రియల్‌ ఎయిర్‌’ కళ్లజోడును ఆవిష్కరించింది. చూడటానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగానే కనిపించే వీటి వెనకాల ఆర్గానిక్‌ ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీనితో సినిమాలు చూడొచ్చు. గేమ్స్‌ ఆడుకోవచ్చు. అంత బిగ్‌ స్క్రీన్‌ను ఆవిష్కరించే గ్లాసెస్‌ కదా.. ఎంత బరువుంటాయో అన్న అనుమానం వద్దు. అవి కేవలం 79గ్రాముల బరువుంటాయి.

సాధారణ యూఎస్‌బీ కేబుల్‌తో గ్లాసెస్‌ను ఫోన్‌కు కనెక్ట్‌ చేస్తే చాలు. 20 అడుగుల స్క్రీన్‌ మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. కళ్లద్దాలకు పక్కనే చెవుల మీదుగా ఉండే ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన స్పీకర్స్‌లోంచి ఆడియో వినబడుతుంది. యూట్యూబ్‌ వీడియోస్‌ చూడొచ్చు, వెబ్‌ను సర్ఫ్‌ చేయొచ్చు. ఒకేసారి అనేక స్క్రీన్స్‌ చూసే అవకాశమూ ఇందులో ఉంది. ఇక రెండోది ఎయిర్‌ కాస్టింగ్‌.  దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎదురుగా ఉన్న వర్చువల్‌ స్క్రీన్‌కు కనెక్ట్‌ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్‌ అంటే గేమ్స్, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, సోషల్‌ మీడియాను ఆపరేట్‌ చేయొచ్చు.  
చదవండి: జాబిల్లిపై పచ్చదనం!

మరిన్ని వార్తలు