వైరల్‌ : నీ టైం బాగుంది ఇంపాల

4 Mar, 2021 10:10 IST|Sakshi
వీడియో దృశ్యం

మన అదృష్టం బాగుంటే పులి నోట్లో తల పెట్టి పడుకున్నా గాటు కూడా పడకుండా బయటపడొచ్చు.. పాము తోక మీద నాట్యం చేయోచ్చు.. సునామిలో కూడా షికారు చేయోచ్చు​..ఇదంతా అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ, వాస్తవం. ఇప్పుడు మనం చెప్పుకునే అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా‌ నిలిచిందో ఇంపాలా. క్షణకాలంలో ముసలి వేట నుంచి తప్పించుకుని ప్రాణాలు నిలుపుకుంది. వివరాల్లోకి వెళితే..  సౌత్‌ ఆఫ్రికాలోని లువాంగ్వా నేషనల్‌ పార్కులో ఉంటున్న కొన్ని ఇంపాలాలు అక్కడి ఓ నీటి కుంట దగ్గరకు దాహం తీర్చుకోవటానికి వెళ్లాయి. ఓ ఆడ ఇంపాల భయంభయంగా అటుఇటు చూస్తూ నీళ్లు తాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిలో దాక్కున్న ఓ పెద్ద మొసలి ఠక్కున దాని మీదకు దూకింది.

ఇది గమనించిన ఇంపాల అంతకంటే వేగంగా పైకి ఎగిరి తప్పించుకుంది. బతుకుజీవుడా అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. మొసలికూడా నోటి కాడి కూడు పోయేసరికి నిరాసతో నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనను ఫొటోగ్రాఫిక్‌ గైడ్‌ పీటర్‌ గెరిడిట్స్‌ వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావ్‌ ఇంపాల’’.. ‘‘ఓపిక లేకపోతే ఎలా క్రొకడైల్‌ బాబు’’..‘‘ అమావాస్యకో.. పున్నానికో మొసల్లనుంచి ఇలా తప్పించుకుంటూ ఉంటాయి..’’..  ‘‘ నీ టైం బాగుంది ఇంపాల’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : దెయ్యం కోసం వెళితే పుర్రె కనపడింది

ఇలాంటి క్యాచ్‌ నెవర్‌‌ బిఫోర్‌ ఎవర్ ఆ‌ఫ్టర్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు