ఇమ్రాన్‌ ఖాన్‌ నటనలో షారుక్‌, సల్మాన్‌లను మించిపోయారు

7 Nov, 2022 12:52 IST|Sakshi

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ దిగ్గజ నటులు సల్మాన్‌, షారుక్‌ ఖాన్‌లను మించి పోయారంటూ కామెంట్‌ చేశారు పాక్‌ నాయకుడు మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌. వజీరాబాద్‌లోని నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌ తనపై జరిగిన దాడిని హత్యయత్నంగా పేర్కొన్నారు. కానీ పాక్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ చీఫ్‌  మౌలానా ఫ్లజుర్‌ మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

తాను తొలుత ఇమ్రాన్‌ ఖాన్‌పై జరిగిన ఘటన గురించి విని బాధపడ్డాను కానీ ఇప్పడూ ఇది ఒక డ్రామాలా కనిపిస్తోందన్నారు. "ఖాన్‌ శరీరంలోకి దిగిన బుల్లెట్‌ ఎలా ముక్కలుగా అయిపోతుంది. శరీరంలో పేలుడు ముక్కలు దిగడం గురించి విన్నాం ఇలాంటిది ఎప్పడూ వినలేదు. ఖాన్‌పై దాడి గురించి విన్నప్పుడూ తాను ఖండించానని చెప్పారు. కానీ ఎక్కడైన బాంబు శకలాలు శరీరంలోకి దిగడం చూశాం కానీ బుల్లెట్‌ శకలాలు శరీరంలో దిగడం ఏమిటో అర్థం కావడం లేదు.

ఐనా ఆయనపై జరిగింది కాల్పులు కానీ బాంబు దాడి కాదన్నారు." ఖాన్‌కి బుల్లెట్‌ గాయాలైనప్పుడూ క్యాన్సర్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖాన్‌ చికిత్స తీసుకుంటున్న షౌకత్ ఖనుమ్ హాస్పిటల్ ఆయన చారిటబుల్‌ సంస్థ నిర్వహస్తున్న ఆస్పత్రేనని చెప్పారు. అలాగే వైద్యుల స్టేట్‌మెంట్లు కూడా చాలా విరుద్దంగా ఉన్నాయన్నారు ఫజ్లుర్‌ రెహ్మాన్‌ .

(చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్‌ బ్లాక్‌!)


 

మరిన్ని వార్తలు