Imran Khan: కశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే..

12 May, 2021 08:30 IST|Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. ‘జమ్మూకశ్మీర్‌ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్‌ భారత్‌ అంతర్గత అంశం కాదు’అని ఆయన మీడియాకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
(చదవం‍డి: చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల)


 

మరిన్ని వార్తలు