లండ‌న్ నుంచి తిరిగొస్తున్న రాములోరు

17 Sep, 2020 15:33 IST|Sakshi

లండ‌న్ :  15వ శ‌తాబ్ధం నాటి సీతారాముల వారి విగ్ర‌హాల‌ను లండ‌న్ నుంచి తిరిగి తెప్పించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. 1978లో  త‌మిళ‌నాడులోని విజ‌య‌న‌గ‌ర కాలంలో నిర్మించిన ఆల‌యం నాటి విగ్ర‌హాలు అప‌హ‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఇవి ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో 2019 ఆగ‌స్టులో లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న్ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నారు. అంతేకాకుండా దొంగ‌తనానికి గురైన రామ‌ల‌క్ష‌ణులు, సీత‌, హ‌నుమంతుని విగ్ర‌హాల‌కు సంబంధించిన ఫోటో ఆర్కైవ్‌ల‌ను నిపుణుల మందుంచారు. ఇవి ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నవేన‌ని దృవీక‌రిస్తూ స‌మ‌గ్ర నివేదిక‌ను పంపారు. (ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం: రాజ్‌నాథ్‌)

భార‌త సాంస్కృతిక వార‌స‌త్వానికి గుర్తుగా ఉన్న ఈ విగ్ర‌హాల‌ను భార‌త్‌కు తిరిగి పంపాల్సిందిగా కోరారు. ఈ అభ్య‌ర్థ‌న‌పై సానుకూలంగా స్పందించిన యూకే ప్ర‌భుత్వం ద‌ర్యాప్తునకు ఆదేశించింది.  అయితే   ఈ విగ్ర‌హాలను కొన్నవ్య‌క్తి ప్ర‌స్తుతం జీవించిలేరు. అంతేకాకుండా వీటికి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ఆధారాలు ఏమీ లేనందున ఈ విగ్ర‌హాలను తిరిగి భార‌త్‌కు అందించ‌డానికి హైక‌మిష‌న్ స‌ముఖ‌త వ్య‌క్తం చేసింది. త్వ‌ర‌లోనే వీటిని త‌మిళ‌నాడుకు బ‌దిలీచేయ‌నున్నారు. గ‌తంలోనూ  రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్ర‌హం, 17వ శ‌తాబ్ధ‌పు కృష్ణుడి విగ్ర‌హం స‌హా ప‌లు భార‌త సంప‌ద‌ను తిరిగి స్వ‌దేశానికి చేర్చ‌డంలో హెచ్‌సిఐ ముఖ్య‌పాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో, ఎఎస్ఐ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, స్వ‌తంత్ర ద‌ర్య‌ప్తు సంస్థ‌ల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామ‌ని హెచ్‌సిఐ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. (చైనాపై దూకుడు కూడా సానుకూలాంశమే)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా