ఖలిస్తాన్‌ వాదులూ జాగ్రత్త!

25 Sep, 2023 06:18 IST|Sakshi

అమెరికాలోని సానుభూతిపరులకు ఎఫ్‌బీఐ హెచ్చరిక

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌–కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న ఖలిస్తానీల ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) హెచ్చరికలు చేసింది.

అమెరికన్‌ సిఖ్‌ కాకస్‌ కమిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న ప్రీత్‌పాల్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ..తనతోపాటు మరో ఇద్దరు అమెరికన్‌ సిక్కులను ఎఫ్‌బీఐ అధికారులు జూన్‌లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు. 

ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన
కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యునైటెడ్‌ హిందూ ఫ్రంట్‌ నిరసన తెలిపింది. భారత వ్యతిరేక ఖలిస్తానీలకు కెనడా ప్రధాని మద్దతు, రక్షణ కలి్పంచడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిపై అంతగా ప్రేముంటే కెనడాలోనే ప్రత్యేక ఖలిస్తాన్‌ను ట్రూడో  ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు