భారత్‌లో తగ్గిన శిశు మరణాలు

10 Sep, 2020 04:48 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990–2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని తెలిపింది. ‘చైల్డ్‌ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్‌ 2020’ పేరుతో ఐరాస నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది.

► భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయ్యి మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది.
► ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు  తగ్గుముఖం పట్టాయి.
► అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్‌ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి.
► సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు