తైవాన్‌ టెన్షన్‌ల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా

5 Aug, 2022 17:40 IST|Sakshi

న్యూఢిల్లీ: లడఖ్‌ ప్రాంతంలోని భారత వైమానిక దళానికి చెందిన సీనియర్‌ అధికారులు చైనాతో సైనిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్‌ గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకై అధికారులు చైనాతో చర్చలు సాగిస్తోంది. ఐతే గత కొన్ని కొన్ని రోజుల్లో ఎలాంటి ఘటన జరగలేదు గానీ ఇటీవల ఒక చైనా మిలటరీ విమానం నియంత్రరేఖకు సమీపంలో సుమారు 10 కి.మీ దూరంలో ఎగిరినట్లు అధికారుల గుర్తించారు. దీంతో భారత వైమానికదళ అధికారులు ఈ విషయమైన స్పందించాల్సి వచ్చింది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్‌ చైనాతో చర్చల సాగిస్తోంది. అదీగాక టిబెట్‌ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. వాటిలో అతి ముఖ్యమైన వైమానిక దళ విభాగం ఉంది. అంతేకాదు టిబెట్‌ సమీపంలోనే ఎయిర్‌బేస్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా చైనా నిర్మిస్తోంది. నియంత్రణ రేఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య భిన్నమైన వాదన కూడా ఉంది. వాస్తవానికి నియంత్రణ రేఖకు సంబంధించిన నిబంధనలు ప్రకారం ఏ మిలటరీ విమానం వాస్తవ నియంత్రణ రేఖకు 10 కి.మీ లోపు ప్రయాణించ కూడదు.

ఈ మేరకు జూన్‌25న చైనాకు సంబంధించిన జే11 విమానం తూర్పు లడఖ్‌ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంగా వచ్చినట్లు భారత్‌ గుర్తించింది. దీంతో భారత వైమానిక దళ అధికారులు అప్రమత్తమవ్వడమే కాకుండా ఇరు దేశాల సైనికలు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. చైనా గత కొంతకాలంగా వాస్తవ నియంత్రణరేఖకు సమీపంలో విమానాలను ఎగరవేస్తూ గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. చైనా ఒక వైపు తైవాన్‌ విషయమై తీవ్ర సంఘర్షణకు లోనవుతూ కూడా భారత్‌తో చర్చలు సాగించడానికి ముందుకు రావడం గమనార్హం.

(చదవండి: తప్పులు సరిదిద్దకోండి!... కెనడాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన చైన)

మరిన్ని వార్తలు