వెనక్కు తగ్గిన ఆస్ట్రేలియా.. వారి ప్రయాణానికి ఓకే

8 May, 2021 02:44 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత్‌ నుంచి తమ దేశ పౌరుల రాకపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ నెల 15 వరకూ నిషేదం అమల్లో ఉండగా, ఆ రోజు (శని వారం) నుంచే భారత్‌ నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్ట్రే లియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. భారత్‌ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

భారత్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే కమర్షియల్‌ విమానాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఆ దేశమే స్వయంగా విమానాలను పంపి పౌరులను తీసుకొని వెళ్లనున్నట్లు చెప్పింది. మే 15 నుంచి 31 మధ్య మూడు విమానాలు భారత్‌కు చేరుకొని తిరిగి వెళతాయని అధికారులు అన్నారు. ఆయా విమానాలు డార్విన్‌కు చేరుకుంటాయని తెలి పారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో థర్డ్‌ వేవ్‌ రాకుండా చూసుకోవడానికే నిబంధనలు పెట్టామని, అ యితే నిబంధనలు కొనసాగించాల్సిన అవ స రం కనిపించనందువల్ల ఆంక్షలు ఎత్తేస్తున్న ట్లు ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వ్యాఖ్యానించారు. 

చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు