భగవద్గీత పార్క్‌ ధ్వంసంపై భారత్‌ సీరియస్‌.. వివరణ ఇచ్చిన కెనడా

3 Oct, 2022 19:04 IST|Sakshi

టోరంటో: కెనడాలోని బ్రాంప్టన్‌లో భగవద్గీత పార్క్‌ ధ్వంసం విషయమై భారత్‌ సీరియస్‌ అయ్యింది. ఆ పార్క్‌ పేరును కూడా తొలగించడంతో భగవద్గీత పార్క్‌లో జరిగిన ద్వేషపూరితమైన ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని, సత్వరమే కెనడా అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కెనడాలోని భారత్‌ హైకమిషన్‌ ట్వీట్‌ చేసింది. ఐతే  ఈ విషయమై బ్రాంప్టన్‌ మేయర్‌ బ్రౌన్‌ ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ.... ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పైగా ఈ విషయమై తమ నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు తీసుకుందని తెలిపారు.

అయితే ఆ పార్క్‌లో ఎలాంటి విధ్యంసం జరగలేదని, కేవలం మరమత్తుల విషయమై  ఆ పేరుని తీసి ఖాళీ గుర్తును ఉంచామని తెలిపారు. ఏదైన ప్రదేశం మరమత్తులు చేయాల్సి వస్తే దాని పేరుని తొలగించి ఆ ప్లేస్‌లో ఇలా ఖాళీగా ఉంచడం సర్వసాధరణమని తెలిపారు. అంతేగాక మరమ్తత్తుల పనులు పూర్తి అయిన వెంటనే అదే పేరును తిరిగి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు.

అంతేగాక ఆ నగర పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. అలాగే విధ్వంసం చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. పైగా గతంలో ఇది ట్రాయ్‌ పార్క్‌ అని ఆ తర్వాత భగవద్గీత పార్క్‌గా మార్చినట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కెనడాలోని స్వామి నారాయణ్‌ మందిర్‌ అనే హిందు దేవాలయాన్ని కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్‌పై ద్వేషంతో కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ హైకమిషన్‌ తీవ్రంగా స్పందించింది. అంతేగాక కెనడాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా అక్కడ ఉన్న భారత పౌరులను, చదువు నిమిత్తం కెనడా వచ్చిన విద్యార్థులను తగు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

(చదవండి: నోబెల్‌-2022: జన్యుశాస్త్ర మేధావి పాబో.. మానవ పరిణామ క్రమంలో సంచలనాలెన్నో!)

మరిన్ని వార్తలు