చైనా దోస్తీతో పదవి ఊడింది.. ఢిల్లీ నిర్ణయాలు ఆ దేశ సంక్షేమానికే!: ఇమ్రాన్‌ ఖాన్‌

22 Apr, 2022 16:48 IST|Sakshi

చైనాతో పాక్‌ వాణిజ్య బంధం కొనసాగాలన్న తన ఉద్దేశం వల్లే ప్రధాని పీఠం నుంచి దించేశారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత.. లాహోర్‌లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో ఖాన్ మాట్లాడారు. పనిలో పనిగా.. భారత్ విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మరోసారి కీర్తిస్తూనే.. సొంత దేశం రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుంది. కానీ, పాక్‌లో అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభం నడుస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌కు అమెరికా సూచించినప్పుడు.. ‘మా దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని సూటిగా చెప్పేసింది. భారత్‌ విదేశాంగ విధానం అనేది తన సొంత ప్రజల కోసం. 

కానీ, మన విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. చైనాతో మన స్నేహాన్ని వారు(తన రాజకీయ ప్రత్యర్థులు) సైతం ఇష్టపడడం లేదు. అప్పుడే కుట్ర (తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా) మొదలైంది’’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులకు కూడా చైనాతో వ్యాపారవాణిజ్యాలు నేను మెరుగుపర్చుకోవడం ఇష్టం లేదు. అందుకే ప్లాన్‌తో కుట్రకు తెర లేపారు. కానీ, ఇక్కడి ప్రతిపక్షాల సహకారం లేనిదే అది జరుగుతుందా?. అలా తనను పదవి నుంచి దించేయడంపై తన చైనా దోస్తీ ఓ కారణమైందని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.

  

రష్యా పర్యటన సమర్థన
ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్‌తో చమురు కొనుగోలుకేనని, పాక్‌ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానని కామెంట్లు చేశాడు. అయితే.. తన స్వతంత్ర విదేశాంగ విధానమే తనకు శాపంగా మారిందని, అది విదేశీ శక్తులకు నచ్చలేదని, కానీ, అలాంటి విదేశాంగ విధానంతోనే భారత్‌ ముందుకెళ్లడం గొప్పదనమని పేర్కొన్నాడు ఇమ్రాన్‌ ఖాన్‌.

చదవండి👉🏾: కానుకల కక్కుర్తిపై ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందన ఇది

మరిన్ని వార్తలు