ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు

1 Nov, 2022 20:48 IST|Sakshi

నవంబర్‌ 20న నేపాల్‌లో ఫెడరల్‌​ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్‌ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్‌ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్‌ శ్రీవాస్తవ్‌ 200 వాహానాలను నేపాల్‌ ఆర్థిక మంత్రి జనార్దన్‌ శర్మకు అందజేశారు.

ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్‌ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్‌ మాట్లాడుతూ...నేపాల్‌ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్‌ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు.

ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్‌ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్‌ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ‍్క్షతలు తెలిపారు నేపాల్‌ మంత్రి  జనార్దన్‌ శర్మ. అదీగాక ఎ‍న్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్‌ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్‌ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. 

(చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్‌ బరిలోకి)

మరిన్ని వార్తలు