రక్షణ సామాగ్రి విషయంలో సాయం చేస్తాం: యూఎస్‌

8 Apr, 2022 13:28 IST|Sakshi

Russian weapons cheaper: రష్యా ఉక్రెయిన్‌ పై దురాక్రమణకు పాల్పడటంతో ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురైంది. రష్యా ఉక్రెయిన్‌ దేశాన్ని నేలమట్టం చేసేలా దాడులు చేయడమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడింది. దీంతో యూఎస్‌ దాని మిత్ర దేశాలు రష్యా ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా రష్యాతో మిత్రత్వం సాగిస్తున్న దేశాలపై  కూడా కన్నెర్రజేసింది.

అంతేకాదు ప్రపంచ దేశాలన్ని ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా భారత్‌తో చమురు, తదితర వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంది. అందులో భాగంగా ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో యూఎస్‌ వెంటనే భారత్‌కి హెచ్చరికలు జారీ చేసింది. తాము విధించిన ఆంక్షలు రష్యాకు అనుకూలంగా వ్యవహరించే దేశాలకు వర్తిస్తాయని వార్నింగ్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ సంక్షోభం సమయంలో భారత్‌ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదీగాక రష్యాతో ఆయుధా సామగ్రి కొనుగోలు, చైనాతో గల సరిహద్దు సమస్యలు గురించి భారత్‌ యూఎస్‌కి తెలిపింది.

అంతేగాక రష్యాతో గల చారిత్రక సబంధాల గురించి కూడా వివరించింది. తాము భద్రతా దృష్ట్యా చౌకగా లభించే రష్యా ఆయుధ సామాగ్రి పైనే ఆధారపడుతున్నట్టు భారత్‌ యూఎస్‌కి స్పషం చేసింది. అయితే భారత్‌ రక్షణ సామాగ్రి ప్రత్యామ్నయ పరిస్థితి గురించి భయపడనవసరం లేదని అందుకు యూఎస్‌ సాయం చేస్తుందని అమెరికా సహాయ కార్యదర్శి విక్టోరియా నులాండ్‌ పేర్కొన్నారు. అంతేగాకుండా రష్యా కంపెనీ భారత్‌ కంపెనీలతో భాగస్వామ్య వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందువల్లే యూఎస్‌ రక్షణ శాఖ విముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు విక్టోరియా నులాండ్  ఈ విషయమై భారతదేశానికి వచ్చి విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లాతో సంప్రదింపులు జరిపారు. 

అయినా రష్యా చైనా ఇరు దేశాలు నిరంకుశ దేశాలని వాటితో సహవాసం భారత్‌కి మంచిదికాదని అన్నారు. ఈ సమయం‍లో రష్యా, చైనా దేశాలకి వ్యతిరేకంగా భారత్‌ నిలబడాలని నొక్కి చెప్పారు. అయితే యూఎస్‌ సైనిక సహకారానికి సంబంధంచి ద్వంద వైఖరి పట్ల భారత్‌ కాస్త అసంతృప్తిగా ఉంది. రష్యాతో ఎలాంటి సాన్నిహిత్యంగానీ భాగస్వామ్య వ్యాపారాలు గానీ సాగించొద్దుని భారత్‌కి యూస్‌ బహిరంగంగానే  చెప్పింది.

(చదవండి: వార్నింగ్‌ ఇచ్చినా హ్యాండ్‌ ఇచ్చిన భారత్‌.. పుతిన్‌ రెస్పాన్స్‌పై టెన్షన్‌!)

మరిన్ని వార్తలు