చైనా కంపెనీ షావోమీకి బిగ్‌ షాక్‌ 

1 May, 2022 07:14 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ దిగ్గజం షావోమీ ఇండియాకు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై రూ.5,551.27 కోట్ల విలువైన కంపెనీ నిధులను శనివారం జప్తు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘గత ఫిబ్రవరిలో రూ.5,551.27 కోట్ల విలువైన నిధులను సొంత గ్రూప్‌ కంపెనీతో పాటు మొత్తం మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ ముసుగులో పంపించింది. చైనాకు చెందిన తన మాతృసంస్థ షావోమీ ఆదేశాల మేరకే ఈ పని చేసింది. అంతిమంగా షివోమీ గ్రూప్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే రెండు యూఎస్‌ కంపెనీలకు కూడా నిధులు బదిలీ చేసింది’’ అని ఈడీ వివరించింది. 

ఇది కూడా చదవండి: అది కాళరాత్రి: జెలెన్‌స్కీ.. ఆయనపై ‘టైమ్‌’ కవర్‌ స్టోరీ

మరిన్ని వార్తలు