ఉత్తర కొరియాకు భారత్‌ భారీ సాయం

25 Jul, 2020 15:30 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం  సాయాన్ని అందించనుంది. క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను ఉత్తర కొరియాకు పంపనుంది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో క్షయ వ్యాధి  సంబంధిత ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కొరియాకు  ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. దానికి  భారత్ సానుకూలంగా స్పందించింది. సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన టీబీ మందులను పంపాలని భారత్‌ నిర్ణయం తీసుకుంది.

చదవండి: కరోనా కట్టడి: ‘ఇది కొరియా షైన్‌ సక్సెస్‌’

ఈ మేరకు ప్రకటన చేసిన భారత విదేశాంగ శాఖ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. ఇదిలా ఉండగా ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి ఎడ్విన్‌ సల్వడార్‌ ఆధ్వర్యంలో కొరియాకు అందజేసినట్లు ప్యాంగ్‌యాంగ్‌లోని భారత ఎంబసీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. 

చదవండి: నార్త్‌ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు