5 Lakh Doses Of Covaxin : అఫ్గాన్‌ వాసులకు ప్రాణాలను కాపాడే గొప్ప బహుమతిని ఇచ్చిన భారత్‌!!

1 Jan, 2022 21:28 IST|Sakshi

గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారతదేశం రెండవ విడత మానవతా సహాయాన్ని అఫ్ఘనిస్తాన్‌కు పంపింది. ఈ విడతలో భారత్ బయోటెక్ కోవిడ్-19 సంబంధించిన  5 లక్షల కోవాక్సిన్ డోస్‌లు పంపించింది. అంతేకాదు ఇరాన్‌కి చెందిన మహాన్ ఎయిర్ విమానం ద్వారా మానవతా సాయం కాబూల్‌కి చేరుకుంది.

(చదవండి:  స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే)

ఈ మేరకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు అఫ్గాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాదు భారత్‌లోని అఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ ట్విట్టర్‌లో "రాబోయే వారాల్లో మరో విడత  500,000 డోస్‌లు సరఫరా చేయబడతాయి. 2022 మొదటి రోజున అఫ్గాన్ ప్రజలకు ప్రాణాలను కాపాడే బహుమతిని అందించినందుకు భారతదేశానికి ధన్యవాదాలు! అని పేర్కొన్నారు.

(చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష)

మరిన్ని వార్తలు