ఓఐసీ ప్రకటనపై భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

5 Apr, 2023 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ అంతర్గత వ్యవహారాలపై ఇస్లామిక్‌ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది ఓఐసీ.  అయితే.. దీనిపై భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. 

వాళ్ల కమ్యూనల్‌ మైండ్‌సెట్‌(మతపరమైన ఆలోచనాధోరణికి) ఇది మరో ఉదాహరణ అని, భారత్‌ వ్యతిరేక ఎజెండాను ఆ దేశాలు మరోసారి బయటపెట్టాయని భారత్‌ మండిపడింది. భారత్‌ అంతర్గత వ్యవహారాలలో ఓఐసీ జోక్యం అక్కర్లేని అంశమని భారత్‌ పేర్కొంది.

పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా ముస్లింలు లక్ష్యంగా హింస, విధ్వంసం చోటుచేసుకున్నాయని ఒక ప్రకటనలో ఆరోపించింది. అధికారులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారత్‌లో ముస్లింల భద్రతకు, హక్కులకు భరోసా ఇవ్వాలని ఓఐసీ తన ప్రకటనలో భారత్‌ను డిమాండ్‌ చేసింది.

ఈ క్రమంలోనే.. భారత్‌ తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పందించారు. ఇస్లామిక్‌ దేశాల సహకార సమాఖ్య జనరల్‌ సెక్రటేరియెట్‌ పేరిట రిలీజ్‌ అయిన ప్రకటనను, బాగ్చీ ఖండించారు. అలాగే జమ్ము కశ్మీర్‌ అంశంలోనూ ఓఐసీ(ఇందులో పాక్‌ కూడా ఉంది) జోక్యాన్ని అవసరమైన అంశంగా తేల్చారు ఆయన. 

మరిన్ని వార్తలు