గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్: భారత్‌ 28 స్థానాలు ఢమాల్‌‌

1 Apr, 2021 09:52 IST|Sakshi

మహిళల పట్ల చిన్న చూపే

డబ్ల్యూఈఎఫ్‌ లింగ వివక్ష సూచీలో భారత్‌కు 140వ ర్యాంక్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) లింగ అసమానతల సూచీలో భారత్‌ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనం. 2021కి సంబంధించి 156 దేశాల జాబితాలో భారత్‌ 140వ స్థానంలో నిల్చింది. 2020లో భారత్‌ ర్యాంకు 112గా ఉంది.

తాజా నివేదిక ప్రకారం రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ సాధికారతకు సంబంధించిన అంతర్గత సూచీలో భారత్‌ 13.5 శాతం మేర క్షీణించింది. మహిళా మంత్రుల సంఖ్య 2019లో 23.1 శాతంగా ఉండగా 2021లో 9.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణం. ప్రొఫెషనల్, టెక్నికల్‌ ఉద్యోగాల్లోనూ మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది. ఇక ఆర్థికాంశాలపరంగా చూస్తే మహిళలు ఆర్జించే ఆదాయం.. పురుషుల ఆదాయంలో అయిదో వంతే ఉంటోంది. దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ , నేపాల్ కంటే  వెనుకబడి ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్‌లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది.  ఆ తరువాతి స్థానాల్లో  ఫిన్లాండ్ నార్వే ఉన్నాయి. కాగా  ఆఫ్ఘనిస్తాన్ 156 చివరి స్థానంలో ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు