భారత్‌ ఆ నిర్ణయం తీసుకుంటే...నేను సంతోషకరమైన రాయబారిని అవుతా!

24 Mar, 2022 18:39 IST|Sakshi

If Indias Position Moved Closer To Ukraine: ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత్‌ సంక్లిష్టమైన తటస్థ వైఖరిని అవలంభిస్తోందని భారత్‌లోని కైవ్ రాయబారి ఇగోర్ పొలిఖా అన్నారు. యూఎన్‌లోని ఉక్రెయిన్‌ మానవతా సంక్షోభానికి సంబంధించిన రష్యా తీర్మానానికి భారత్‌ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇగోర్ పొలిఖా ప్రస్తావిస్తూ భారత్‌ని అభినందించారు. దీంతో రష్యాకు ఒకే ఒక మద్దతుదారు (చైనా) లభించిందని చెప్పారు.

అంతేగాక ఉక్రెయిన్‌కు భారత్‌ మానవతా సహాయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రశంసించారు. అదే సమయంలో వాషింగ్టన్‌లోని ఇతర మిత్ర దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్‌ పై రష్యా దాడి విషయంలో భారత్ స్పందను గురించి కూడా మాట్లాడారు. తాను భారత్‌ విదేశాంగ విధాన అవసరాలను లోతుగా అర్థం చేసుకున్నాని అన్నారు. ఒక ఇండాలజిస్ట్‌గా తాను అనేక అధికారిక అనధికారిక విషయాలను అర్థం చేసుకోగలను అని కూడా చెప్పారు. కానీ రాయబారిగా మాకు మద్దతు ఇవ్వండి అని ఒత్తిడి చేయక తప్పడం లేదని అన్నారు. అంతేకాదు భారత్‌ గనుకు రష్యా దాడికి వ్యతిరేకంగా బలమైన నిర్ణయం తీసుకుంటే తాను రాయబారిగా మరింత సంతోషిస్తానని అన్నారు.

ఈ యుద్ధం ఒకరకరంగా అందర్నీ ఒకింత ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు. ఈ యుద్ధం ఇన్ని రోజులు సాగుతుందని రష్యన్ల కూడా అనుకుని ఉండరన్నారు. పైగా రష్యన్లు సైనిక మరణాల గణనను కూడా విడుదల చేయడం లేదని చెప్పారు. వాళ్ల తప్పుడు లెక్కల ప్రకారం నాలుగు రోజ్లులో యుద్ధం ముగిసిపోతుందని పైగా ప్రతి వీధిలో సైనికుడు పుష్ప గుచ్చంతో స్వాగతం పలుకుతారని ఊహించుకుంటోంది రష్యా అని విమర్శించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ ఇంతమంది మద్దతును కూడగట్టుకుని అతి పెద్ద శక్తిగా అవతరిస్తారని రష్యన్లు ఊహించలేకపోయారని అన్నారు. తమ అధ్యక్షుడు నేపథ్యం అందరికీ తెలుసని కానీ ఈ యుద్ధం మొదలైన తర్వాత చాలా మంది నాయకులు హాస్య నటులుగా మారిపోవడం విశేషం అని వ్యంగ్యంగా అన్నారు.

(చదవండి: యుద్ధాన్ని ఆపమని పుతిన్‌కి చెప్పగలిగేది చైనా మాత్రమే!)

మరిన్ని వార్తలు