ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ గెలుచుకున్న భారత్‌

18 Oct, 2021 09:07 IST|Sakshi

లండన్‌: క్వీన్ ఎలిజబెత్ II మనవడు ప్రిన్స్ విలియం లండన్‌లో జరిగిన ఎర్త్‌షాట్ ప్రైజ్‌ అవార్డు వేడుకల్లో కోస్టారికా, ఇటలీ, బహామాస్, భారతదేశాల ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌లను గెలుచుకున్నాయి. వాతావరణ మార్పు  గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మన భూమిని ఏవిధంగా రక్షించుకోవాలి అనే అంశంలోని సరికొత్త ఆవిష్కరణలకు  ఈ వార్షిక అవార్డులను ప్రకటించారు. మొత్త ఐదుగురు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పైగా ఒక్కొక్కరిక 1.4 మిలియన్‌ డాలర్ల్‌ పౌండ్లు అందజేస్తారు. అంతేకాదు ఈ ఆవిష్కరణలు  స్కాంట్లండ్‌లో జరిగే  కాప్‌56 శిఖరాగ్ర సదస్సుకు ఎంతోగానో ఉపకరిస్తాయని ప్రిన్స్‌ విలియమ్స్‌ అన్నారు.

(చదవండి:  "అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ విజయవంతం")

ఈ మేరకు అడవుల రక్షణకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ విభాగంలో కోస్టారికా రిపబ్లిక్ "ప్రకృతిని రక్షించండి పునరుద్ధరించండి" అనే అవార్డును, భారత్‌ వ్యవసాయ వ్యర్థాలను ఎరువుగా మార్చే పోర్టబుల్ మెషిన్‌ను సృష్టించినందుకు భారతీయ కంపెనీ తకాచర్ "క్లీన్ అవర్ ఎయిర్" అవార్డును గెలుచుకోగా, బహమాస్‌ పగడాలకు సంబంధించిన ప్రాజెక్టు విభాగంలోనూ, ఉత్తర ఇటాలియన్‌ నగరం "ఫుడ్ వేస్ట్ హబ్స్" విభాగంలోనూ, థాయ్‌ జర్మనీ పరిశుభ్రమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్‌ను ఆవిష్కరించినందుకు అవార్డులను గెలుచుకున్నాయి .

ఈ మేరకు  మానవ జాతి పరిష్కరించలేని వాటిని కూడా పరిష్కరించగలదు అంటూ విలియమ్స్‌ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విలియమ్స్‌ మాట్లాడుతూ....."మనం పర్యావరణం కోసం తీసుకునే చర్యలు రానున్న పది సంవత్సరాల కాలంలో మనం భూమి మనుగడను  నిర్దేశిస్తాయి. మన భవిష్యత్తును మనమే నిర్ధేసించుకోవాలి. మనం అనుకోవాలే గానీ సాధ్యం కానీదంటూ ఉండదు." అని అన్నారు. అయితే విలియం తండ్రి, ప్రిన్స్ చార్లెస్‌ కూడా దీర్ఘకాల పర్యావరణవేత్తగా ఎన్నో సేవలందించడం విశేషం. ఈ ఎర్త్‌షాట్ ప్రైజ్‌ వేడుకను గతేడాది అక్టోబర్‌ నుంచి ప్రారంభించారు. తదుపరి ఎర్తషాట్‌ ప్రైజ్‌ వేడుక యూఎస్‌లో జరుగుతుందని విలియమ్స్‌ ప్రకటించారు.

(చదవండి:  బలశాలి బామ్మ)

మరిన్ని వార్తలు