అమెరికాలో కీలక పదవిలో ఇండియన్‌ అమెరికన్‌

3 Mar, 2021 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌: బైడెన్‌ ప్రచార కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన భారతీయ సంతతికి చెందిన మజూ వర్గీస్‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి డిప్యూటీ అసిస్టెంట్‌గా, వైట్‌ హౌస్‌ మిలిటరీ ఆఫీస్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. న్యాయవాది అయిన వర్గీస్, బైడెన్‌ ప్రచార కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా సేవలందించారు. దేశానికీ, అధ్యక్షుడికీ సేవచేయడం తనకు గౌరవం అంటూ, తన బృందం సభ్యులతో కలిసి చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని, కలిసి సృష్టించిన చరిత్రను, నేడు అప్పగించిన బాధ్యతలను గురించి వర్గీస్‌ ట్వీట్‌ చేశారు. 

అధ్యక్షుడి ప్రయాణ సంబంధింత విషయాలూ, వైద్య వ్యవహారాలూ, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రి సౌకర్యాలు తదితర విషయాలను వైట్‌ హౌస్‌ మిలిటరీ ఆఫీస్‌ నిర్వహిస్తుంది. అధ్యక్షుడి ఇనాగురల్‌ కమిటీలోని నలుగురు సభ్యుల్లో వర్గీస్‌ ఒకరు. జనవరి 20న జరిగిన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల నిర్వహణా బాధ్యతలు చూసింది ఈ కమిటీయే. యిప్పుడు వైట్‌హౌస్‌ మిలిటరీ ఆఫీస్‌ డైరెక్టర్‌గా, బైడెన్‌ డిప్యూటీ ఆసిస్టెంట్‌గా  మరిన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

చదవండి:
హెచ్‌–1బీపై ఎటూ తేల్చని బైడెన్‌ ప్రభుత్వం

జస్ట్‌ 10 సెకన్ల వీడియోకు రూ.48 కోట్లు!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు