భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష 

31 May, 2021 08:40 IST|Sakshi

హూస్టన్‌: హెల్త్‌ కేర్‌ స్కామ్‌కు పాల్పడిన భారతీయ అమెరికన్, నర్సింగ్‌ ప్రాక్టిషనర్‌ త్రివిక్రమ్‌ రెడ్డికి అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, 5.2 కోట్ల డాలర్ల  (దాదాపు రూ. 376 కోట్లు) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హెల్త్‌కేర్‌ ఫ్రాడ్‌ స్కీమ్‌లో తన పాత్రను త్రివిక్రమ్‌ రెడ్డి (39) కోర్టు ముందు అంగీకరించారని టెక్సాస్‌ నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ప్రేరక్‌ షా వెల్లడించారు. మెడికేర్, ప్రైవేట్‌ బీమా సంస్థలను మోసం చేసే పథకానికి రెడ్డి రూపకల్పన చేశారని నిర్ధారణ అయిందన్నారు.

పేషెంట్ల చికిత్సకు సంబంధించిన తప్పుడు బిల్లులను రూపొందించి బీమా సంస్థలను భారీ మొత్తాలకు మోసం చేశారన్నారు. అందుకు, ఆరుగురు డాక్టర్ల వివరాలను వాడుకున్నాడని తెలిపారు. ఈ ఆరుగురి డాక్టర్ల ఐడీ నెంబర్లు, ఇతర వివరాలను దొంగిలించి... త్రివిక్రమ్‌ వీరు తన క్లినిక్‌లలో పేషెంట్లకు చికిత్స చేసినట్లు బిల్లులు సృష్టించి... బీమా సంస్థల నుంచి తప్పుడు క్లెయిమ్‌లు పొందాడు.

త్రివిక్రమ్‌ రెడ్డి మోసం గురించి మొదట 2019 జూన్‌లో వెల్లడయింది. 2020 అక్టోబర్‌లో ఆయన తన నేరాన్ని అంగీకరించారు. ఈనెల 25న కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. వాక్సహాచీ మెడికల్, టెక్సాస్‌ కేర్‌ క్లినిక్స్, వీ– కేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ల పేరిట త్రివిక్రమ్‌ మూడు క్లినిక్‌లను నిర్వహించేవారు.
చదవండి: మాజీ భార్యపై జానీ డెప్​ తప్పుడు ప్రచారం!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు