కొలంబో తీరంలో కాలిపోతున్న నౌక..  ఐసీజీ చేయూత

26 May, 2021 17:01 IST|Sakshi

కొలంబో: గుజరాత్‌ నుంచి శ్రీలంకలోని కొలంబో పోర్టుకు వెళ్తున్న సరుకు రవాణా నౌక ఎంవీ ఎక్స్‌ప్రెస్‌ పెర్ల్‌లో ఆరు రోజుల కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. కొలంబో పోర్టుకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మంగళవారం ఒక కంటైనర్‌ అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో నౌకలో ఉన్న వివిధ దేశాలకు 25 మంది సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా కాపాడారు.

కాలిపోతున్న నౌకలోని సరుకును సురక్షితంగా తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే  రెండు ఐసీజీ ఓడలు 'వైభవ్',  'వజ్రా'లను సహాయం కోసం పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునే వైభవ్‌, వజ్రల పంపించినట్లు కోస్ట్‌గార్డ్‌ అధికారులు పేర్కొన్నారు. వీటికి అదనంగా, కొచ్చి, చెన్నై, టుటికోరిన్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను తక్షణ సహాయం కోసం రెడీగా ఉంచినట్లు పేర్కొన్నారు.  ఈ ఆపరేషన్ కోసం శ్రీలంక అధికారులతో ఐసీజీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
చదవండి: ఘోర రైలు ప్రమాదం.. 213 మందికి గాయాలు


 

మరిన్ని వార్తలు